మానవాళిని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల 85 వేల మందిపైగా వైరస్ బారిన పడ్డారు. దాదాపు లక్షా 80 వేల మందిని మహమ్మారి బలి తీసుకుంది. ప్రాణాంతక వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షలు దాటింది.
ఐరోపాలో...
ఐరోపా దేశాల్లో వైరస్ ప్రభావం మొదటి నుంచి అధికంగానే ఉంది. ఆ దేశాల్లో లక్షా పదివేల మందికిపైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 12 లక్షల 47 వేల మంది వైరస్ బాధితులు ఐరోపా నుంచే ఉన్నారు.
స్పెయిన్లో ..
గత రెండు రోజుల నుంచి కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో మరో 435 మంది మరణించినట్లు ఆ దేశ యంత్రాంగం తెలిపింది. దీంతో మొత్తం 21,717మంది మరణించారు. ఇప్పటివరకు 2 లక్షల 8వేల కేసులు నమోదయ్యాయి.