తెలంగాణ

telangana

ETV Bharat / international

కోలుకున్నా గానీ కళ్లల్లోనే కరోనా తిష్ఠ!

కరోనా కేవలం ఉపిరితిత్తుల్లోనే ఉంటుందని ముందుగా అంచనా వేసినా.. కళ్లలోనూ ఈ వైరస్ వృద్ధి చెందుతుందని తాజాగా స్పష్టమైనట్లు పరిశోధకులు చెబుతున్నారు. కన్నీరు, ఇతర కంటి స్రావాల ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వుహాన్​ నుంచి తిరిగొచ్చి ఇటలీ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు.

Coronavirus can linger in your eyes
కోలుకున్నా గానీ కళ్లల్లోనే కరోనా తిష్ఠ!

By

Published : Apr 26, 2020, 9:32 AM IST

కరోనాకు మన కళ్లూ స్థావరాలేనని వెల్లడైంది. కోలుకున్న ఓ బాధితురాలి కళ్లలో ఐదు రోజుల తర్వాత వైరస్‌ ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు ఈ నిర్ధారణకు వచ్చారు. ముక్కు, నోటితో పాటు కళ్ల ద్వారా బయటి నుంచి ఈ వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలుసు. తాజాగా కళ్లలోనూ ఈ వైరస్‌ వృద్ధి చెందుతుందని.. కన్నీరు, ఇతర కంటి స్రావాల ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టమైందని ఇటలీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం ముందస్తు కరోనా లక్షణం కావొచ్చని సూచిస్తున్నారు.

గుర్తించారిలా..

చైనాలోని వుహాన్‌ నుంచి జనవరి 23న తిరిగొచ్చిన మహిళ ఒకరు ఐదురోజుల తర్వాత ఇటలీ ఆసుపత్రిలో చేరారు. పొడి దగ్గు, గొంతులో ఇన్‌ఫెక్షన్‌తో పాటు ఆమె కళ్లుగా ఎర్రగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. కొద్ది రోజులకు ఆమెకు జ్వరంతో పాటు, కళ్లు మరింత ఎర్రగా మారడంతో.. వైద్యులు రోజూ ఆమె కళ్ల నుంచి స్రావాలు సేకరించి పరీక్షించారు. ఇలా 21 రోజుల పాటు ఆమె కళ్లలో కరోనా వైరస్‌ ఉన్నట్లు వెల్లడైంది. తర్వాత ఆమె కోలుకుని ఇంటికి వెళ్లారు. మళ్లీ ఐదు రోజులకు ఆమె కళ్లలోని స్రావాలను పరీక్షించగా.. కరోనా వైరస్‌ తిరిగి వచ్చినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ABOUT THE AUTHOR

...view details