తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా తుంపర్ల వ్యాప్తిని లెక్కించడం ఇక సులువే!

కొవిడ్, కరోనా పేరేదైనా 2020పై అది చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలియక ప్రయాణాలు, కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడాల్సిన సమయమిది. ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్లే ప్రతీచోటా గాలిలో కరోనా ఉందో లేదో తెలుసుకునే వెసులుబాటు ఉంటే?

corona story
గాలిలోని కరోనా తుంపర్లను లెక్కించడం ఇక సులువే!

By

Published : Dec 25, 2020, 9:29 AM IST

గాలిలో కరోనా వైరస్​ తుంపర్ల వ్యాప్తిని లెక్కగట్టే సరికొత్త విధానాన్ని యూరప్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గాలి తుంపర్ల వ్యాప్తి స్థాయిని కొలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. గాలిలో సంచరించే ధూళి కణాలనూ.. మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు వెలువడే తుంపర్లను విభజించి చూడటం చాలా కష్టం. అయితే నెదర్లాండ్స్​లోని అమ్​స్టర్​డాం విశ్వవిద్యాలయ పరిశోధకులు గాలిలో తుంపర్ల స్థాయిని మాత్రమే గుర్తించేలా ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. దీన్ని చేత్తో పట్టుకుని వినియోగించవచ్చు.

ఇదీ చదవండి:'మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్​కు అనుమతివ్వండి'

''గాలిలోని ప్రతి తుంపరలోనూ కరోనా వైరస్​ మిళితమై ఉండదు. కానీ, మునుపటి పరిశోధనల డేటా ఆధారంగా.. ఒక నిర్దిష్ట ప్రదేశంలో వైరస్​ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవడానికి మేము అభివృద్ధి చేసిన విధానం ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే.. జిమ్​లు, రైళ్లు, కార్యాలయాల్లో తుంపర్ల సంచారం వందరెట్లు అధికంగా ఉంటుంది. ఇందుకు కారణం.. ఆయా చోట్ల గాలి ప్రసరణ పరిమితంగా ఉండటం'' అని పరిశోధకులు పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో తుంపర్ల వ్యాప్తి స్థాయిని తెలుసుకోవడం ద్వారా కొవిడ్​ ముప్పును అంచనా వేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'టెస్టుల పరిస్థితే క్లాసికల్​ చెస్​కు ఎదురుకావచ్చు'

ABOUT THE AUTHOR

...view details