అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నైపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్సిన్ను ఎవరు కనుగొన్నా అది ప్రపంచంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాంతానికో, దేశానికో వాక్సిన్ను పరిమితం చేయరాదని పేర్కొన్నారు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజారోగ్యం కోసం శథవిధాలా ప్రయత్నించాలని స్పష్టం చేశారు గుటేరస్.