కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న కేసులు, మరణాలతో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 65వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2.5 లక్షల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అమెరికా విలవిల..
ప్రాణాంతక కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. వైరస్‌కు కేంద్ర బిందువైన న్యూయార్క్ నగరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అక్కడ మృత్యువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి రెండు నిమిషాలకు ఒక్కరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. అమెరికాలో ఇప్పటికే 8,454 మంది మృతి చెందారు. 3,11,637 మంది వైరస్ బారిన పడ్డారు.
ఐరోపా దేశాల్లో పరిస్థితి..