తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపాలో కరోనా మరణాల్లో వారే అధికం

ఐరోపాలో కొవిడ్​ కారణంగా మరణించే వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. వారిలో ఎక్కువ శాతం ఆసుపత్రుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. చలి తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.

corona death rate is high in senior citizens of europe
ఐరోపాలో కరోనా మరణాల్లో వారే అధికం

By

Published : Dec 7, 2020, 6:30 AM IST

ఐరోపాలో కరోనాతో మరణిస్తున్న వారిలో వృద్ధులే అధికంగా ఉంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఆసుపత్రిలోనే కన్నుమూస్తున్నారు. సెప్టెంబరు నుంచి చలికాలం ప్రారంభం కావడంతో దాని ప్రభావం రోగులపైనా పడింది. దీంతో బంధువులు ఎవర్నీ ఆసుపత్రుల్లోకి రానీయకుండా ఆంక్షలు విధించడం మరోరకమైన సమస్యగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులకు సేవలు అందించే విషయమై నర్సులకు శిక్షణ ఇచ్చేందుకు పోర్చుగల్‌ ప్రభుత్వం మిలటరీని ఉపయోగిస్తోంది. ఫ్రాన్స్‌లో గత నెలలో 5,000 మంది మరణించారు. జర్మనీ, ఇటలీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి ఉద్యోగులు, రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయించడం ద్వారా బెల్జియంలో కరోనా వ్యాప్తిని అరికట్టగలిగారు. బ్రిటన్‌లో కరోనా టీకాను ఆసుపత్రుల ఉద్యోగులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యంగా ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:'సంక్షోభ సమయంలో ఆశకు సంకేతం క్రిస్మస్​'​

ABOUT THE AUTHOR

...view details