ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 20,000 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. మొత్తంగా 2,80,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 2,09,600 మందికిపైగా వైరస్ సోకింది. ఆదివారం ఒక్కరోజే 11,012 మందిలో వైరస్ నిర్ధరణ అయింది. 1900 మంది కరోనాకు బలయ్యారు.
రష్యాలోని కేసుల్లో సగానికి పైగా మాస్కోలోనే నమోదయ్యాయి.
లాక్డౌన్ అమలుకే బ్రిటన్ మొగ్గు..
వైరస్‌పై పోరులో మిగతా దేశాలు పలు ఆంక్షలు సడలిస్తున్నా.. సంపూర్ణ లాక్డౌన్ వైపే మొగ్గు చూపింది బ్రిటన్. మరో మూడు వారాల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే 31,660మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. 2,15,000 మంది వైరస్ బారినపడ్డారు.
ఇటలీలో 4వేల మందికి వైరస్ నయం..
వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటైన ఇటలీలో కొత్తగా 4వేలమందికి పైగా వైరస్ నుంచి విముక్తి పొందారు. తాజాగా 1000 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 194మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మొత్తంగా మృతుల సంఖ్య 30,395గా ఉండగా... 2,18,260కు పైగా బాధితులు ఉన్నారు.
టర్కీలో 50 మంది మృతి
టర్కీలో కొత్తగా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,546 మందికి వైరస్ సోకింది. మొత్తం మరణాల సంఖ్య 3,739 గా ఉండగా.. 1,37,000 మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారు. 89,480 మంది కోలుకున్నారు.
సోమవారం నుంచి పలు ఆంక్షల సడలించనుంది టర్కీ. షాపింగ్ మాళ్లు, సెలూన్లు తెరుచుకోనున్నాయి.
పాక్‌లో కొత్తగా 1990మందికి వైరస్..