కార్చిచ్చు విధ్వంసాలు, వరద బీభత్సాలు, కరిగిన మంచుపర్వతాలు, అడుగంటిన నదులు, ప్రచండ గాలులతో కూడిన తుఫాన్లు, మండే ఎండలు, వేల సంఖ్యలో మరణాలు... 2021లో భూతాపం కారణంగా భూమిపై మనిషి జీవన విధానం ఎలా మారిందో కళ్లకు గట్టే ఘటనలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించి ఈ ఏడాది ఎంతో ప్రాణనష్టం, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వాతావరణ మార్పులే ఈ విధ్వంసాలకు కారణం. దీంతో మనిషి మనుగడ సాగించాలంటే భూతాపాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అవసరముందని మేలుకొన్న ప్రపంచదేశాలు గ్లాస్గోలో సమావేశమవుతున్నాయి. వాతావరణ మార్పులకై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ఇక నుంచి సీరియస్‌గా దీనిపై దృష్టిసారించనున్నాయి.
బెల్జియం, జెర్మనీ, చైనా, టెన్నెస్సీలో ఈ ఏడాది వరదలు విధ్వసం సృష్టించాయి. అమెరికా పశ్చిమ ప్రాంతాలు, గ్రీస్, ఆర్కిటిక్‌లో కార్చిచ్చు ధాటికి వేల ఎకరాలు బూడిదయ్యాయి. 'కాప్26' పేరిట గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో పాల్గొంటున్న ప్రపంచ దేశాల అధినేతలకు భూతాపం కారణంగా ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో తెలిపి కనివిప్పు కల్గించే ఈ దృశ్యాలు.. హెచ్చరికలు.
జులై 19న జర్మనీలో వరదల బీభత్సం అనంతరం చెత్తను రోడ్డుపై విసురుతున్న మహిళ పరాగ్వే నది అడుగంటిపోయాక మిగిలిన జలాల్లో ఉన్న పడవలు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నది నీటి మట్టం పడిపోయింది. ఈ ఫొటో సెప్టెంబర్ 21 నాటిది. టర్కీలోని మర్మరా సముద్రంలో నురగ నీటి మధ్య నుంచే సెయిలింగ్ చేస్తున్న ప్రజలు. ఈ ఫొటో జూన్ 8న తీసింది. అమెరికా కొలంబస్ సర్కిల్ సమీపంలో ఇడా తుపాను బీభత్సం సమయంలో వర్షంలోనే రోడ్డు దాటుతున్న మహిళ. ఇది సెప్టెంబర్ 1 నాటి ఫొటో. జులై 29న అర్జెంటీనాలోని రోసారియోలో కరవు సమయంలో పరానా నదికి ఉపనది అయిన ఓల్డ్ పరానా నదీతీరాన్ని ఫొటోలు తీస్తున్న వ్యక్తిపైనుంచి పక్షులు ఎగురుతున్న దృశ్యం అమెరికా టెన్నెస్సీలో వరద కారణంగా కూలిపోయిన తన మనవరాలి ఇంట్లో వస్తువుల కోసం చూస్తున్న తాత. ఈ ఫొటో ఆగస్టు 23నాటిది. ఉత్తర స్పెయిన్‌లోని పాంప్లోనాలో మండుటెండల నుంచి సేద తీరుతూ పౌంటెయిన్ వద్ద జలకాలాడుతున్న బాలుడు. ఆగస్టు 13నాటి ఫొటో ఇది. బెల్జియంలోని లైగి రాష్ట్రం అంగ్లేర్లో వరదలో చిక్కుకున్న మహిళను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న స్థానికులు. జులై 16న తీసిన ఫొటో ఇది. ఆస్ట్రేలియా సిడ్నీ శివారులోని ఓ ఇల్లు వరదల ధాటికి నీట మునిగింది. మార్చి 23న తీసిన ఫొటో ఇది. కాలిఫోర్నియా కార్చిచ్చు కారణంగా నివాసం కోల్పోయిన కుటుంబానికి సాయం చేసిన మహిళ. ఆగస్టు 17నాటి ఫొటో ఇది. కాలిఫోర్నియాలో భూతాపానికి అడుగంటుతున్న ఓ సరస్సులో చేపలు పడుతున్న మత్స్యకారుడు. ఆగస్టు 22న తీసిన ఫొటో. ఫిబ్రవరి 7న నైరుతి ఫ్రాన్స్‌లోని వైన్యార్డ్స్.. వరదల కారణంగా నీటి మునిగిన చిత్రమిది. వాతవరణ మార్పు వల్లనే ఈ విపత్తు సంభవించి ఉంటుందని నిపుణులు చెప్పారు. దీని వల్ల ఫ్రాన్స్‌కు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. మే 4న గ్రేట్ సాల్ట్ సరస్సు అంచున ఉప్పు పొరపై గులాబీ వర్ణంలో నీరు చేరింది. ఈ సరస్సు నీటిమట్టం కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతోంది. కార్చిచ్చు బీభత్సానికి నైరుతి టర్కీలోని అడవి ధ్వంసమైంది. దీనికి సమీపంలోనే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఉంది. మంటలు కాంపౌండ్ వరకు వ్యాపించడం వల్ల సిబ్బందిని ఖాళీ చేయించారు. ఆగస్టు 5 నాటి ఫొటో ఇది. ఫిబ్రవరి 16న డల్లాస్‌లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం వల్ల మంచు కురిసింది. దీంతో దుప్పటి కప్పుకుని స్టోర్‌కు వెళ్తున్న మహిళ ఫొటో ఇది. అమెరికా ఆరిజోనాలో హూవర్ డ్యామ్ నీటిమట్టం రికార్డుస్థాయిలో పడిపోయింది. ఆగస్టు 13న అక్కడ ఫొటోలు తీసుకుంటున్న ప్రజలు. ఫిబ్రవరి 14న అలస్కా జునియాలో ఈగల్ హిమనీనదిలో పేరుకుపోయిన మంచు. సెంట్రల్ చైనాలోని హెనాన్ రాష్ట్రంలో వరద నీటిలో సైకిల్‌పైనే వస్తువులు తీసుకెళ్తున్న వ్యక్తి. జులై 26నాటి ఫొటో ఇది. కాలిఫోర్నియా ప్లుమాస్ కౌంటీలో కార్చిచ్చు ధాటికి బూడిదవుతున్న పర్వత ప్రాంతం. ఆగస్టు 13నాటి ఫొటో ఇది. ఆగస్టు 6న గ్రీస్‌లోని ఓ ద్వీపంలో కార్చిచ్చు వ్యాపిస్తున్న దశ్యాలను సముద్ర తీరం నుంచి వీక్షిస్తున్న వ్యక్తి బొలీవియాలో భూతాపం కారణంగా అడుగంటిన సరస్సు సమీపంలో నివాసాలు ఏర్పరచుకున్న ప్రజలు. మే 24 నాటి ఫొటో ఇది. ఫిబ్రరి 3న జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌లో వరదల కారణంగా జలమయమైన ప్రాంతం నుంచి వెళ్తున్న రైలు. అక్టోబర్ 20న దక్షిణ సుడాన్‌లోని ఉత్తర బహర్ ఎల్ గజల్ రాష్ట్రంలోని లాంగిక్‌లో చిన్న బురద వాగుపై నిలబడి ఉన్న పిల్లలు నిలిచిపోయిన నీటిలో ప్రతిబింబిస్తున్నారు, కాలిఫోర్నియా డెత్ వ్యాలీ నేషనల్ పార్కు సరస్సు అడుగంటిపోయింది. జులై 11న ఇద్దరు వ్యక్తులు సరస్సులో ఉప్పుపై నడుస్తున్న ఫొటో ఇది రష్యాలోని అలెగ్జాండ్రా ల్యాండ్ ద్వీపంలో ఐస్ బ్రేకర్ ద్వారా కార్గో షిప్‌కు దారి చేస్తున్న దృశ్యం. మే 17న ఈ ఫొటో తీశారు. జులై 20న న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పొగ కమ్మేసింది. సమీపంలో కార్చిచ్చు కారణంగా ఈ ప్రాంతం ఇలా మారింది.