తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రెటా థన్‌బర్గ్‌కు 'ప్రత్యామ్నాయ నోబెల్'​ పురస్కారం - sweeden

పర్యావరణ పరిరక్షణకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న స్వీడన్​ యువతి గ్రెటా థన్​బర్గ్​ను 'ప్రత్యామ్నాయ నోబెల్​' పురస్కారం వరించింది. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాల్సిన అవసరాన్ని ఐరాస వేదికగా చాటిచెప్పినందుకుగానూ రైట్​ లైవ్​లీహుడ్​ ఫౌండేషన్​ అవార్డును ప్రకటించింది.

గ్రెటా థన్‌బర్గ్‌కు ప్రత్యామ్నాయ నోబెల్​ పురస్కారం

By

Published : Sep 25, 2019, 1:37 PM IST

Updated : Oct 1, 2019, 11:22 PM IST

గ్రెటా థన్‌బర్గ్‌కు 'ప్రత్యామ్నాయ నోబెల్'​ పురస్కారం

స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కు నోబెల్​కు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే రైట్ లైవ్​లీహుడ్ పురస్కారం లభించింది. వాతావరణ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు తక్షణం పూనుకోవాల్సిన అవసరాన్ని ఐరాస వేదికగా చాటిచెప్పినందుకుగానూ ఆమెకు ఈ అవార్డు అందిస్తున్నట్లు రైట్ లైవ్‌లీహుడ్ ఫౌండేషన్ వెల్లడించింది. సోమవారం గ్రెటా చేసిన ఉద్విగ్నభరిత ప్రసంగం ఎంతోమంది నేతలను ఆలోచనలో పడేసిందని కొనియాడింది ఆ సంస్థ.

మరో ముగ్గురికి...

ఈ ఏడాది రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు గ్రెటాతో పాటు మరో ముగ్గురిని వరించింది. మానవహక్కుల పరిరక్షణ ఉద్యమకారుడు అమినటో హైదర్, చైనాకు చెందిన మహిళా హక్కుల పరిరక్షకురాలు గువో జియాన్మే, అడవుల పరిరక్షణకు పాటుపడుతున్న బ్రెజిల్‌కు చెందిన దావి కోపెనావాకు ఈ అవార్డు లభించింది.

నోబెల్​కు ప్రత్యామ్నాయంగా..

పర్యావరణం, అంతర్జాతీయ అభివృద్ధి రంగాల్లో నోబెల్ పురస్కారాలు ప్రదానం చేసేందుకు నోబెల్ ఫౌండేషన్ నిరాకరించింది. ఆ పురస్కారానికి ప్రత్యామ్నాయంగా 1980లో రైట్ లైవ్‌ లీ హుడ్ అవార్డును ఆవిష్కరించారు.

ఇదీ చూడండి:'గ్లోబల్​ గోల్​ కీపర్' పురస్కారం​ స్వీకరించిన మోదీ

Last Updated : Oct 1, 2019, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details