ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ స్వహస్తాలతో రచించిన ఓ పుస్తకాన్ని జులై 8న వేలం వేయనుంది క్రిస్టీస్ సంస్థ. లండన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో.. పుస్తకం ధర 8.5 లక్షల నుంచి కోటీ 30 లక్షల అమెరికన్ డాలర్ల మధ్య పలుకుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది.
1687లో ప్రచురించిన 'మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫీ' సెకెండ్ ఎడిషన్‌కు సంబంధించి న్యూటన్ రాసిన నోట్సే ప్రస్తుతం వేలంలోకి రానుంది. ఈ పుస్తకంలో ప్రముఖ స్కాటిష్ గణిత శాస్త్రవేత్త డేవిడ్ గ్రెగోరీ రాసిన కామెంట్స్, డయాగ్రామ్స్ కూడా ఉన్నాయని క్రిస్టీస్ వెల్లడించింది. న్యూటన్ సెకండ్ ఎడిషన్ కోసం డేవిడ్ గ్రెగోరీతో కలిసి కృషి చేసినట్లు తెలుస్తోందని పేర్కొంది.