అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుర్భుజ కూటమి 'క్వాడ్' విషయంలో చైనాకు చెందిన ఓ నేత అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ను బెదిరించేందుకు యత్నించారు. ఈ విషయాన్ని బైడెన్ స్వయంగా వెల్లడించారు.
యూకే ఆతిథ్యమిస్తున్న జీ7 శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా లండన్‌లో ప్రసంగించిన జో బైడెన్.. అధ్యక్ష పదవి చేపట్టక ముందు చైనా నాయకుడు ఒకరు తనతో మాట్లాడారని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల విషయంలో తన వైఖరేంటో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపారు. క్వాడ్ బలోపేతానికి దూరంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే వివరాలు వెల్లడించలేదు బైడెన్.
"ఎన్నికైన తర్వాత ఏం చేస్తారని నన్ను అడిగినప్పుడు.. అమెరికా బలాబలాలను పునరుద్ధరిస్తామని చెప్పాను. మాపై నమ్మకం ఏర్పడేలా చేస్తా అని బదులిచ్చా. ఆ తర్వాత చైనా నేత.. క్వాడ్ విషయంలో కల్పించుకోకూడదని సూచించారు. 'మీరు క్వాడ్‌తో కలిసి పనిచేయకూడదు' అని చెప్పారు."