కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది చైనా ప్రభుత్వం. ప్రమాదం పొంచి ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు అత్యవసరంగా టీకాలు అందజేస్తున్నామని అక్కడి వైద్యాధికారులు మీడియాకు వెల్లడించారు.
"18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని వుహాన్ యంత్రాంగం ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 24 నుంచే దీన్ని మొదలుపెట్టింది. అందుకోసం 15 జిల్లాల్లోని 48 క్లినిక్‌లను ఎంపిక చేసింది. నాలుగు వారాల వ్యవధితో రెండు టీకా డోసులను తీసుకోవాల్సి ఉంటుంది" అని వుహాన్ వైద్యాధికారి వివరించారు.
మరో దేశంలో 'స్పుత్నిక్' టీకా