తెలంగాణ

telangana

ETV Bharat / international

చెర్రీ పూల వసంతం.. పర్యటకుల పులకింత!

జర్మనీలోని పురాతన నగరం బాన్​లో ఏటేటా అద్భుతం జరుగుతుంది. వసంతకాలంలో మాత్రమే పూచే చెర్రీ పూలు నగర వీధుల్లో పూల పందిర్లను తలపిస్తున్నాయి. వీటిని చూస్తూ పర్యటకులు పరవశిస్తున్నారు.

నగరానికి కొత్త అందాలు అద్దిన చెర్రీ పూలు

By

Published : Apr 8, 2019, 12:57 PM IST

నగరానికి కొత్త అందాలు అద్దిన చెర్రీ పూలు

జర్మనీ పురాతన నగరం బాన్​లో ఏటా జరిగే అద్భుతం చెర్రీ పూల వసంతం. వీధులన్నీ పూర్తిగా లేత గులాబీ రంగు చెర్రీ పూలతో పులకింపజేస్తున్నాయి. మరో 2 వారాలు మాత్రమే పూచే ఈ పుష్పాలను చూడడానికి దేశవిదేశాల పర్యటకులు బాన్​ నగరానికి చేరుకుంటున్నారు.

జర్మనీ ఏకీకరణకు ముందు రాజధాని నగరంగా బాన్​ ఓ వెలుగు వెలిగింది. 1980ల్లో ఈ మహోన్నత నగరానికి రిటైర్డ్​ సిటీ ప్లానర్ బ్రిగిట్టె డెంకల్​ పునఃరూపకల్పన చేశారు. జపాన్​ వారు బహూకరించిన చెర్రీ మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటించారు. నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి ప్రతి వసంతకాలంలోనూ పూచే ఈ పుష్పాలు చూడడానికి ప్రకృతి ప్రేమికులు ఈ నగరానికి వస్తూనే ఉన్నారు.

ఇదీ చూడండి: కృత్రిమ మేధతో 'రోబో సైనికులు' వస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details