డైటింగ్ అని కొన్ని రోజులు కడుపు కట్టుకుని కూర్చుంటాం. కానీ అది ఎంతో కాలం కొనసాగించలేం. ఒక్కసారిగా మళ్లీ భకాసరుడిలా తినడం మొదలుపెడతాం. అయితే... ఆహారపు అలవాట్లపై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు పరిశోధకులు. పరిమిత ఆహారం తీసుకొని వెంటనే సమృద్ధికరమైన ఆహారానికి (రిచ్డైట్) మారడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.
పోషకాహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్యం నెమ్మదిగా రావడం, వయస్సుతో వచ్చే అనారోగ్య సమస్యల అంశమై చేసే మేలు వంటి అంశాలపై బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశోధన చేశారు. ఫ్రూట్ ఫ్లైస్ అనే కీటకాలపై వీరి పరిశోధన సాగింది. వీటికి ముందుగా పరిమిత ఆహారాన్ని అందించి... తర్వాత పోషకాహారం(రిచ్ డైట్) ఇచ్చారు.