వేర్వేరు తయారీ సంస్థల టీకాలను మిక్స్(Vaccine Mixing) చేయడమనేది 'ప్రమాదకర ధోరణి' అని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. దాని వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతుందని వారించారు. టీకా మిక్స్ ప్రభావంపై పూర్తి సమాచారం అందుబాటులో లేదని వివరించారు.
"టీకాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న దేశాల్లోని ప్రజలు.. ఏ టీకా తీసుకోవాలో స్వయంగా నిర్ణయించుకునే వైఖరి పెరిగింది. జాగ్రత్తగా ఉండండి. రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవడం ప్రమాదకరం. టీకా మిక్సింగ్ ఫలితాలపై విశ్వసనీయ సమాచారం కానీ, సాక్ష్యాలు కానీ లేవు. వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పటివరకు వేచి ఉండండి."
-సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త