తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లికి కరోనా- పెంపుడు జంతువులతో ప్రమాదమా? - COVID-19 in animals

బెల్జియంలో ఓ పెంపుడు పిల్లికి కరోనా వైరస్​ సోకినట్లు నిర్ధరణ కావడం కలకలం రేపింది. ఇతర పెంపుడు జంతువులతో మనుషులకు ముప్పు పొంచి ఉందా అన్న ఆందోళనలకు కారణమైంది. ఇంతకీ నిపుణుల మాటేంటి?

Cat found infected with coronavirus in Belgium
బెల్జియంలో పెంపుడు పిల్లికి కరోనా లక్షణాలు

By

Published : Mar 28, 2020, 1:54 PM IST

Updated : Mar 28, 2020, 2:43 PM IST

బెల్జియంలో పిల్లికి కరోనా వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. వైరస్​ బాధితుడు అయిన ఓ వ్యక్తి నుంచి తన పెంపుడు పిల్లికి కరోనా సోకిందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని అధికారుల చెబుతున్నారు. అయితే పెంపుడు జంతువుల నుంచి మానవులకు ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు.

హాంకాంగ్​లోనూ..

హాంకాంగ్​లోనూ ఇలాంటి కేసులే నమోదయ్యాయి. వైరస్​తో బాధపడుతున్న వ్యక్తులకు చెందిన 17 కుక్కలు, 8 పిల్లులకు స్క్రీనింగ్​ పరీక్ష నిర్వహించగా.. 2 శునకాలకు కరోనా సోకినట్లు నిర్ధరించారు అక్కడి వైద్యులు. వైరస్​ సోకిన వ్యక్తులు, జంతువులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాల ద్వారా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధి, డాక్టర్​ ఇమ్మాన్యుయేల్​ ఆండ్రీ తెలిపారు.

శునకంలో లక్షణాలు లేవు కానీ..

వైరస్​ మానవుల నుంచి జంతువులకు వ్యాపిస్తుంది. కానీ సమాజంలో జంతువులు అంటువ్యాధులకు కేంద్రం అవుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. హాంకాంగ్‌లో కుక్కల్లో వైరస్​కు సంబంధించి ఎటువంటి లక్షణాలను కనిపించలేదు. కానీ బెల్జియంలో పిల్లి తాత్కాలిక శ్వాసకోశ, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలో తెలిపింది.

పరిశుభ్రత అవసరం

మానవులకు వైరస్​ వ్యాప్తి చెందడానికి పెంపుడు జంతువులు వాహకాలు కాదని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంట్లో పెంచే జంతువులు పరిశుభ్రం ఉండేటట్లు చూసుకోవాలని, వాటితో సన్నిహితంగా ఉన్నప్పుడు చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు.

ఇదీ చూడండి:వెంటిలేటర్ల తయారీ కోసం ట్రంప్​ 'పవర్​ఫుల్​ చట్టం'

Last Updated : Mar 28, 2020, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details