బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు - British Prime Minister
14:48 April 19
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇదివరకే నిర్ణయమైన వచ్చేవారం పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు భారత్, బ్రిటన్ ప్రభుత్వాల తరఫున బ్రిటన్ ప్రధాని కార్యాలయం డౌన్‌స్ట్రీట్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది చివరిలో ఇరుదేశాల ప్రధానమంత్రులు సమావేశమై భారత్-బ్రిటన్ భవిష్యత్తు భాగస్వామ్యంపై చర్చిస్తారని పేర్కొంది. బ్రిటన్ ప్రధాని భారత పర్యటన వాయిదా పడటం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు బోరిస్ జాన్సన్ ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంది. అప్పుడు బ్రిటన్ స్ట్రెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బ్రిటన్ ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.