బ్రెగ్జిట్‌కు మరో 10 రోజుల సమయమున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పార్లమెంట్లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు సభాపతి జాన్ బెర్కో నిరాకరించారు.
"ఈ తీర్మానాన్ని చర్చకు ఆమోదించటం లేదు. ఎందుకంటే ఒకే బిల్లుపై ఒకే సభలో రెండు సార్లు ఓటింగ్ కుదరదు."
- జాన్ బెర్కో, హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్
ఫలితంగా బ్రస్సెల్స్‌లో జరగనున్న ఐరోపా నేతల భేటీ సందర్భంగా బ్రెగ్జిట్‌కు మరో 3 నెలలు వాయిదా వేయాలని సభలో ఎంపీలు నిర్ణయించారు. అక్టోబర్ 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించుకోవాలని పట్టుదలతో ఉన్న బోరిస్‌కు బెర్కో మోకాలడ్డేశారు.
ఇదీ చూడండి: బ్రెగ్జిట్‌పై తగ్గిన బ్రిటన్ ప్రధాని... ఐరోపా సమాఖ్యకు లేఖ