బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు 158వ స్పీకర్‌గా ప్రముఖ లేబర్ పార్టీ శాసనసభ్యుడు లిండ్సే హోయల్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలో లిండ్సేకే మద్దతు పలికారు ఎంపీలు. జాన్ బెర్కో స్థానాన్ని లిండ్సే భర్తీ చేయనున్నారు.
లిండ్సే హోయల్.. గత 22 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2010 నుంచి మాజీ స్పీకర్ జాన్ బెర్కోకు సహాయకుడిగా సేవలందిస్తున్నారు. నూతన స్పీకర్ ఎన్నికలో పోటీపడిన ఆరుగురు అభ్యర్థులను వెనక్కి నెట్టి 540 మంది సభ్యులు కలిగిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో 325 ఓట్లు సాధించారు లిండ్సే.
రాజకీయంగా శక్తిమంతమైన మహిళా ఎంపీ హర్రియత్ హర్మాన్ మొదటి మూడు రౌండ్లలో లిండ్సేకు గట్టి పోటీ ఇచ్చారు.చివరి రౌండ్లో కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. సుమారు 60 శాతం మంది శాసనసభ్యుల ఓట్లను సంపాదించారు.