తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంటి పెరట్లో మారథాన్​- 5 గంటల్లో రూ.17 లక్షల విరాళం - 42 కి మీటర్లు పరుగు తీసిన జేమ్స్​ కాంప్బెల్

కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు బ్రిటన్​కు చెందిన క్రీడాకారుడు వినూత్న ప్రయోగం చేశాడు. ఇంటి పెరట్లోనే 42.2 కిలోమీటర్లు పరుగెత్తి 18 వేల పౌండ్లు రాబట్టాడు.

British man runs marathon in backyard for charity during lockdown
కరోనా పోరుపై విరాళం కోసం మారథాన్​.. 42 కి.మీ పరుగు

By

Published : Apr 2, 2020, 2:25 PM IST

కరోనా వైరస్​ కారణంగా ప్రపంచ దేశాలు లాక్​డౌన్​ను ప్రకటించాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీ, ఇంటర్నెట్​తో కాలక్షేపం చేస్తున్నారు.​ కానీ... బ్రిటన్​కు చెందిన ప్రముఖ క్రీడాకారుడు తన 32వ పుట్టినరోజున ఇంటి ఆవరణలోని గార్డెన్​లోనే మారథాన్​ పూర్తి చేశాడు.

జావెలిన్​ త్రో మాజీ ఆటగాడైన జేమ్స్​ క్యాంప్​బెల్ చెల్టెన్​హమ్​లోని​ తన ఇంటి పెరటిలో దాదాపు 7 వేల సార్లు తిరిగి మొత్తం 42.2 కిలోమీటర్లు పరుగెత్తాడు. ఐదు గంటల పాటు సాగిన ఈ మారథాన్​ను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దానితో పాటు ఓ వెబ్​సైట్​ లింక్​ ఇచ్చి... కరోనాపై పోరు కోసం విరాళాలు ఇవ్వాలని కోరాడు.

జేమ్స్​ మారథాన్ ముగిసే సమయానికి 18 వేల పౌండ్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థకు అందజేశాడు.

కరోనా పోరుపై విరాళం కోసం మారథాన్​.. 42 కి.మీ పరుగు

ఇదీ చదవండి:ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్​ హతం​!

ABOUT THE AUTHOR

...view details