తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2019, 5:18 AM IST

ETV Bharat / international

జెరెమీ​ కార్బిన్​పై బ్రిటన్​ భారతీయ సంఘాల ఆగ్రహం​

కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని బ్రిటన్​లోని​ విపక్ష లేబర్​ పార్టీ తీర్మానించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్​కు అక్కడి భారతీయ సంఘాలు ఉమ్మడిగా లేఖ రాశాయి. కశ్మీర్​ అంశం పూర్తిగా భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేశాయి. లేబర్​ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి.

జిమ్​ కార్బిన్​పై బ్రిటన్​ భారతీయ సంఘాల ఆగ్రహం​

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా బ్రిటన్​ విపక్ష లేబర్​ పార్టీ నిరసన గళాన్ని వినిపించిన నేపథ్యంలో అక్కడి భారతీయ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వారి తీర్మానాన్ని ఖండిస్తూ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్​కు ఉమ్మడిగా లేఖ రాశాయి. ఇందులో బ్రిటన్​ హిందూ సంఘం, భారత జాతీయ విద్యార్థి విభాగం(ఐఎన్​ఎస్​ఏ), ఇండియన్​ ప్రొఫెషనల్స్​ ఫోరం(ఐపీఎఫ్​), వివిధ ఆలయ సంఘాలు ఉన్నాయి.

'కశ్మీర్​ అంశంపై దీర్ఘకాలంగా భారత్​-పాక్​ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కశ్మీర్​ విషయంలో లేబర్​ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం' అని లేఖలో పేర్కొన్నారు ఆయా సంఘాల ప్రతినిధులు.

కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సెప్టెంబర్​ 25న అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది బ్రిటన్​ విపక్ష లేబర్​ పార్టీ. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్​లో పర్యటించి.. ప్రజల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు కార్బిన్​.

ఇదీ చూడండి:ఈక్వెడార్​లో పెల్లుబికిన ప్రజాగ్రహం- కర్ఫ్యూ విధింపు

ABOUT THE AUTHOR

...view details