బ్రిటన్లో భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రమణియన్ అరుదైన ఘనత సాధించారు. శాస్త్ర, సాంకేతికత రంగంలో ప్రతిష్ఠాత్మక అవార్డు పొందారు.
లండన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్మన్తో కలిసి సంయుక్తంగా '2020 మిలీనియమ్ టెక్నాలజీ ప్రైజ్'ను అందుకున్నారు బాలసుబ్రమణియన్. డీఎన్ఏకు సంబంధించిన పరిశోధనలో వీరికి ఈ అవార్డు దక్కింది. టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్(టీఏఎఫ్) ఈ అవార్డు ప్రదానం చేసింది.