ఇప్పటికే బ్రెగ్జిట్‌పై థెరిసా మే ప్రవేశపెట్టిన 3 ప్రతిపాదనలు బ్రిటన్ పార్లమెంట్లో వీగిపోయాయి. ప్రత్యామ్నాయాలపై కసరత్తులు చేసినప్పటికీ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు.
బ్రెగ్జిట్‌పై ప్రతిపక్షంతో మరోమారు 'మే' చర్చలు - Brexit
ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రాకుండా చూసేందుకు బ్రిటన్ ప్రధాని ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షంతో మరోమారు చర్చలకు సిద్ధమయ్యారు.
లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్‌తో బ్రిటన్ ప్రధాని చర్చలు
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఈనెల 12తో గడువు ముగుస్తుంది. ఈ గడువును పొడిగించాలన్న తీర్మానం బ్రిటన్ పార్లమెంట్‌లోని దిగువ సభలో ఒక్క ఓటు అధిక్యంతో ఆమోదం పొందింది. నేడు ఎగువసభ ముందుకు రానుంది.
గడువు పెంపు తీర్మానాన్ని పార్లమెంట్ ఎగువసభ ఆమోదించకపోతే... బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాల్సి వస్తుంది.
Last Updated : Apr 4, 2019, 9:08 AM IST