తెలంగాణ

telangana

ETV Bharat / international

మెదడుకు శిక్షణతో మోషన్‌ సిక్‌నెస్‌ దూరం! - LATEST STUDY OF BRAIN

బ్రిటన్​ శాస్త్రవేత్తలు మోషన్​ సిక్​నెస్​కు విరుగుడు కనిపెట్టారు. 'విజువోస్పేషియల్‌ శిక్షణ' అభ్యాసాల ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని తేల్చారు. ఇవి మోషన్‌ సిక్‌నెస్‌ను 50 శాతం మేర తగ్గించాయన్నారు.

మెదడుకు శిక్షణతో మోషన్‌ సిక్‌నెస్‌ దూరం!
మెదడుకు శిక్షణతో మోషన్‌ సిక్‌నెస్‌ దూరం!

By

Published : Sep 21, 2020, 7:37 AM IST

వాహనాల్లో ప్రయాణించే సమయంలో కొందరికి ఒళ్లు తిప్పడం, వాంతులు కావడం వంటి (మోషన్‌ సిక్‌నెస్‌)వి తలెత్తుతుంటాయి. దీనికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు విరుగుడును కనిపెట్టారు. 'విజువోస్పేషియల్‌ శిక్షణ' అభ్యాసాల ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని తేల్చారు. ఇవి మోషన్‌ సిక్‌నెస్‌ను 50 శాతం మేర తగ్గించాయన్నారు.

వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్‌లు, సిమ్యులేటర్లు ఉపయోగించే సమయంలోనూ మోషన్‌ సిక్‌నెస్‌ ఉత్పన్నమవుతుంది. డ్రైవింగ్‌ కాకుండా.. పుస్తక పఠనం, సినిమాలు చూడటం వంటివాటిలో ఎక్కువగా నిమగ్నం కావడానికి ప్రజలు ఇష్టపడుతున్న నేపథ్యంలో వారికి మోషన్‌ సిక్‌నెస్‌ తగ్గించడం చాలా ముఖ్యమైంది. దీనివల్ల ఏటా 508 బిలియన్‌ డాలర్ల మేర ఉత్పాదకత పెరగొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణ రుగ్మతను తగ్గించడానికి బ్రిటన్‌లోని వార్‌విక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 3డీ సిమ్యులేటర్‌ను రూపొందించారు. దీని సాయంతో మెదడుకు విజువోస్పేషియల్‌ శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రయాణం సాఫీగా, ఆహ్లాదకరంగా సాగిపోతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details