తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 4:47 AM IST

Updated : Jan 12, 2020, 5:06 AM IST

ETV Bharat / international

బ్రిటన్ యువరాణి మేఘన్​ మెర్కెల్ నటిగా రీఎంట్రీ!

బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్​ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా మేఘన్ తన పూర్వ వృత్తి (నటన)ని చేపట్టేందుకు డిస్నీ లండన్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

britain princess meghan merkel
బ్రిటన్ యువరాణి మేఘన్​ మెర్కెల్ నటిగా రీఎంట్రీ!

ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రిటన్ రాజకుమారుడు డ్యూక్​ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య డచెస్ ఆఫ్ ససెక్స్​ మేఘన్​ మెర్కెల్​ అప్పుడే తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన (నటన) వృత్తిని తిరిగి చేపట్టేందుకు మేఘన్ డిస్నీ లండన్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మేఘన్​ టీవీ సీరియళ్లలో, సినిమాల్లో నటించారు. ప్రిన్స్ హ్యారీతో వివాహమైన తరువాత నట జీవితాన్ని వదులుకున్నారు.

విరాళం కాదు.. కలిసి పనిచేస్తా

ఏనుగుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న 'ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్' అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా, మేఘన్​.... వారితో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది.

మహారాణికి ఓ లేఖ

సీనియర్ రాయల్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు మేఘన్ ఇటీవలే రాజకుటుంబానికి లేఖ రాశారు. రాణి ఎలిజబెత్​కు మద్దతుగా ఉంటూనే.. సొంతంగా పనిచేసుకోవాలని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై రాణి ఎలిజబెత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:'అంగారక యాత్ర' వ్యోమగాముల్లో ఇండో-అమెరికన్​

Last Updated : Jan 12, 2020, 5:06 AM IST

ABOUT THE AUTHOR

...view details