తెలంగాణ

telangana

ETV Bharat / international

రాజ బిరుదులకు దూరంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు - తెలుగు అంతర్జాతీయం వార్తలు

ప్రిన్స్​ హ్యారీ దంపతులు​ తమ రాజ బిరుదులను, ప్రజా నిధులను వదులుకునేందుకు అంగీకరించారు. ఈ మేరకు బకింగ్​హామ్​ ప్యాలెస్​ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

Britain's Prince Harry and Meghan to give up royal titles
రాజ బిరుదులకు దూరంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు

By

Published : Jan 19, 2020, 10:52 AM IST

Updated : Jan 19, 2020, 3:25 PM IST

రాజ బిరుదులకు దూరంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు

బ్రిటన్​ ప్రిన్స్​ హ్యారీ, అయన భార్య మేఘన్ మార్కెల్​​ వారి రాజ బిరుదులు, ప్రజా నిధులను వదులుకోవడానికి అంగీకరించారు. రాజకుటుంబం నుంచి వేరుపడుతున్నట్టు హ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కెనడాలో తమ వ్యక్తిగత జీవితాన్ని గడపనున్న ఈ దంపతులతో.. వారం రోజులుగా రాజకుటుంబీకులు చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే బకింగ్​హామ్​ ప్యాలెస్​ నుంచి ప్రకటన వెలువడింది.

ఈ క్రమంలో క్వీన్​ ఎలిజబెత్​ మనవడు హ్యారీ, భార్య మేఘన్​లకు రాజ బిరుదులు వర్తించవు. గతంలో హ్యారీ తల్లి ప్రిన్సెస్​ డయానాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 1996లో ప్రిన్స్​ చార్లెస్​ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత దివంగత​ డయానా తన బిరుదులను వదులుకున్నారు.

రాజ బిరుదులకు దూరంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు

కొన్ని నెలల సంభాషణలు, ఎన్నో చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చాం.నా మనవడు, అయన కుటుంబం కోసం నిర్మాణాత్మక, సరైన మార్గాన్ని ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. రెండేళ్లలో వారు ఎదుర్కొన్న సవాళ్లను నేను గుర్తించాను. స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకునే వారి అభిప్రాయానికి నేను మద్దతిస్తున్నాను.

క్వీన్​ ఎలిజబెత్​ II, బ్రిటన్ రాణి.​

హ్యారీ, మేఘన్​లు కొంత కాలంగా వార్తాల్లో నిలుస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలపై అనేక మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై హ్యారీ కేసులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి. వీటిని ప్రస్తావిస్తూ క్వీన్​ ఎలిజబెత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

మేఘన్​ సంతోషంగా ఉండాలి...

మేఘన్​పై ప్రశంసల వర్షం కురిపించారు రాణి. ​చాలా త్వరగా తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయినందుకు సంతోషంగా ఉందని.. ఈ జంట ఎంతో ఆనందం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

3.2 మిలియన్​ డాలర్లు వెనక్కి...

ఇకపై హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీలో సభ్యులుగా కొనసాగరు కనుక వారికి హెచ్​ఆర్​హెచ్​(హిస్​ ఆర్​ హర్​ రాయల్​ హైనెస్​) వర్తించవని బకింగ్​హామ్ ప్యాలెస్​ ఓ ప్రత్యేక ప్రకటన వెలువరించింది. వారు అధికారిక సైనిక నియామకాలతో సహా రాజ విధులను వదులుకొనేందుకు అంగీకరించినట్లు, ఇకపై వారికి ప్రజా నిధులు వర్తించబోవని తెలిపింది. వీటితో పాటు విండ్సర్​ కాజిల్ సమీపంలోని ఫ్రాగ్మోర్​ కాటేజ్​ ఇంటిని పునరుద్ధరించేందుకు హ్యారీ దంపతులు ఖర్చు చేసిన.. 3.1 మిలియన్​ డాలర్లు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది.

Last Updated : Jan 19, 2020, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details