అఫ్గానిస్థాన్‌లో (Afghanistan news) పరిస్థితులపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు(G7 countries) ఈనెల 24న సమావేశం కానున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి స్థానికులతో పాటు ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై అత్యవసర చర్చల కోసం మంగళవారం జీ-7 నాయకుల సమావేశం జరగనుంది. కాబుల్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా సాగేలా, స్థానికంగా ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా, 20 ఏళ్లలో అఫ్గాన్ ప్రజలు సాధించిన ప్రగతిని కాపాడేలా.. అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం చాలా అవసరం" అని బోరిస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
జీ-7 కూటమిలో(G7 Summit 2021) అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
వర్చువల్‌గా హాజరుకానున్న బైడెన్..
జీ-7 కూటమి సమావేశానికి (G7 Summit) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వర్చువల్‌గా హాజరుకానున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు, 20 ఏళ్లుగా తమ సైన్యానికి సాయం చేసిన స్థానికులు, బలగాలను సురక్షితంగా వెనక్కి రప్పించే అంశాలపై బైడెన్ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. శరణార్థులకు సాయం చేసే అంశంపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు సాకి.
అస్థిరంగానే పరిస్థితులు..