వేణువు, సన్నాయి వంటి సంగీత సాధనాలను ఊదినప్పటితో పోలిస్తే.. గట్టిగా మాట్లాడినప్పుడే వ్యక్తుల నుంచి అధిక స్థాయిలో తుంపర్లు (ఏరోసోల్స్) వెలువడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. వాటిని వాయించినప్పుడు వచ్చే తుంపర్లు, శ్వాస వదిలినప్పుడు బయటికొచ్చే సూక్ష్మబిందువులతో దాదాపు సమానంగా ఉన్నాయని పేర్కొంది. సన్నాయి, బాకా, పిల్లనగ్రోవి తదితర 13 రకాల సంగీత సాధనాలను వినియోగించినప్పుడు ఏ స్థాయుల్లో ఏరోసోల్స్ వస్తున్నాయో తెలుసుకునేందుకు బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం తదితర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
వేణుగానం కంటే.. మాటలతోనే ఎక్కువ తుంపర్లు - తుంపర్ల వ్యాప్తి కొవిడ్
గట్టిగా మాట్లాడినప్పుడే వ్యక్తుల నుంచి అధిక స్థాయిలో తుంపర్లు (ఏరోసోల్స్) వెలువడుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సన్నాయి, బాకా, పిల్లనగ్రోవి తదితర 13 రకాల సంగీత సాధనాలను వినియోగించినప్పుడు ఏ స్థాయుల్లో ఏరోసోల్స్ వస్తున్నాయో తెలుసుకునేందుకు జరిపిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది.
మాటలతోనే ఎక్కువ తుంపర్లు
వ్యక్తులు బిగ్గరగా మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లతో పోలిస్తే.. కళాకారులు ఈ పరికరాలను ఊదినప్పుడు వచ్చే ఏరోసోల్స్ సంఖ్య తక్కువగానే ఉంటున్నట్లు వారు గుర్తించారు. కాబట్టి వారి ప్రదర్శనలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు స్వల్పంగానే ఉంటాయని పేర్కొన్నారు. మహమ్మారి నేపథ్యంలో సంగీత ప్రదర్శనలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంలో తాజా అధ్యయన ఫలితాలు కీలకంగా మారే అవకాశముంది.
ఇదీ చదవండి :''గ్రీన్పాస్'లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ పరిశీలించండి'