ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌లో కేవలం ఆరోగ్యవంతులపైనే టీకా ప్రయోగిస్తున్నారు. తద్వారా శరీరంలో యాంటీబాడీల స్థాయిని అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రయోగాల్లో బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. ఇకపై హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్‌ను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
వీటిలో పాల్గొన్న వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత వారికి వైరస్ సోకేలా చేస్తారు. అనంతరం వైరస్ సమర్థతను పరీక్షిస్తారు. దీంతో వ్యాక్సిన్ పనితీరు కచ్చితంగా తెలిసే ఆస్కారం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా బయో కంటెయిన్‌మెంట్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఫ్లూ, మలేరియా, కలరా వంటి వ్యాధుల చికిత్స, వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇటువంటి ప్రయోగాలను చేపట్టారు. తాజాగా కొవిడ్-19 వ్యాక్సిన్, చికిత్స పరిశోధనల్లో ఈ తరహా ప్రయోగాలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేయనున్నారు.
జనవరి నెలలో ఛాలెంజ్ ట్రయల్స్ చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయోగాల్లో ఏ కంపెని తయారు చేసిన వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్నారనే విషయం తెలియరాలేదు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫికి చెందిన వ్యాక్సిన్‌లు మాత్రం ఈ ప్రయోగాల్లో వాడడం లేదని సమాచారం.
నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు..