కరోనా మహమ్మారితో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. తాజాగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన ప్రకటన మరింత కలవరానికి గురిచేస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ(సెకండ్ వేవ్) ప్రారంభమైందని తెలిపారు. పరోక్షంగా మరోసారి కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చునని సంకేతాలు ఇచ్చారు. ఫ్రాన్స్, స్పెయిన్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు తిరిగి విజృంభించాయని.. అదే తరహాలో బ్రిటన్ కూడా రెండో దశ ఎదుర్కోవడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భౌతిక దూరం వంటి కొవిడ్ కట్టడి నిబంధనల్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దనే నిబంధనలు అక్కడ ఇప్పటికే అమలులో ఉన్నాయి.
బ్రిటన్‌లో రెండో దశకు చేరిన కరోనా - బ్రిటన్‌లో రెండో దశకు చేరిన కరోనా
బ్రిటన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.. మరోసారి కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చునని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భౌతిక దూరం వంటి కొవిడ్ కట్టడి నిబంధనల్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా 4,322 కేసులు వెలుగులోకి వచ్చాయి. మే నెల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,88,412 కేసులు నమోదయ్యాయి. వీరిలో 41,821 మంది మరణించారు. కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టడంతో నిర్ధారణ పరీక్షల తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంత మంది పరీక్షల కోసం ఏకంగా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.