తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్: మూడో ప్రయత్నమైనా సఫలమయ్యేనా? - BREXIT

బ్రిటన్ ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ బిల్లును మూడోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.  థెరిసా ప్రతిపాదించిన ఈ బిల్లుపై శుక్రవారం చర్చించేందుకు బ్రిటన్​ దిగువ సభ స్పీకర్ అంగీకరించారు.

నేడు మూడోసారి పార్లమెంటుకు​ బ్రెగ్జిట్​ బిల్లు

By

Published : Mar 29, 2019, 7:08 AM IST

నేడు మూడోసారి పార్లమెంటుకు​ బ్రెగ్జిట్​ బిల్లు
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు రూపొందించిన బ్రెగ్జిట్​ బిల్లు మరోసారి పార్లమెంటు ముందుకు రానుంది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన ఈ బిల్లును హౌస్​ ఆఫ్​ కామన్స్​ (దిగువ సభ)లో శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు.

బిల్లుపై చర్చించేందుకు దిగువ సభ స్పీకర్​ అంగీకరించారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్న బిల్లు పూర్తిగా భిన్నమైందని ఆయన తెలిపారు. మే ప్రతిపాదించిన ఒప్పంద బిల్లును ఇప్పటికే రెండుసార్లు పార్లమెంటు తిరస్కరించింది.

విడిపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఒప్పందాన్ని ఆమోదించాలని మే పట్టుబడుతున్నారు. దీనికోసం రాజీనామా అస్త్రాన్ని థెరిసా ప్రయోగించారు. బిల్లును వ్యతిరేకించే వారు కూడా ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయేందుకు మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో మే బిల్లును అంగీకరించాలని పార్లమెంటును కోరారు ప్రభుత్వ ప్రతినిధి ఆండ్రియా లీడ్​సమ్. సమాఖ్య నుంచి మే 22న బ్రిటన్​ వైదొలిగేలా సభ్యులు సహకరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details