తెలంగాణ

telangana

ETV Bharat / international

త్వరగా విడిపోదాం... కలిసి రండి: మే - brexit bill

బ్రెగ్జిట్​​ ఒప్పంద గడువును ఏప్రిల్ 12వరకు పొడిగించడంలో సఫలీకృతమయ్యారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ఎంపీల మద్దతును కూడగట్టేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

బ్రెగ్జిట్​పై ఎంపీలతో థెరెసా మే చర్చలు

By

Published : Mar 23, 2019, 10:18 AM IST

బ్రెగ్జిట్​పై ఎంపీలతో థెరెసా మే చర్చలు
బ్రిటన్​ పార్లమెంటులో బ్రెగ్జిట్​ బిల్లును ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించారు ఎంపీలు. ఎలాగైనా ఈ సారి అందరి మద్దతు కూడగట్టాలని వ్యూహరచన చేస్తున్నారు ప్రధానమంత్రి థెరెసా మే. మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
వచ్చే వారం పార్లమెంట్​లో బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని మూడోసారి ప్రతిపాదించనున్నారు మే. ఈసారి బిల్లు ఆమోదం పొందితే ఒప్పందం ప్రకారం మే 22న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ అధికారికంగా వైదొలుగుతుంది.
ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే ఏప్రిల్​ 12లోపు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కనిపెట్టాలి. లేకపోతే ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగాలి. గడువు పొడిగింపునకు మరోమారు అభ్యర్థించే అవకాశమూ లేకపోలేదు.

ABOUT THE AUTHOR

...view details