ప్రపంచదేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 64 లక్షలకు చేరువైంది. 10 లక్షల 60 వేలమందికిపైగా మరణించారు.
అమెరికాలో ఒక్కరోజే 48 వేల 715 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 77 లక్షల 76 వేలు దాటాయి. మరో 932 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 16 వేలు దాటింది.
మెక్సికోలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. 4,828 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 471 మంది కొవిడ్‌కు బలయ్యారు.
బ్రెజిల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసులు 50 లక్షల మార్కును అధిగమించాయి. బుధవారం 31 వేల కొత్త కేసులు.. 733 మరణాలు సంభవించాయి.
- ఫ్రాన్స్‌పై కరోనా మళ్లీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొత్తగా 18 వేలకుపైగా కేసులను గుర్తించారు.
- అర్జెంటీనా, బ్రిటన్ సహా ఆసియా దేశాల్లోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
- మెక్సికో, ఇరాన్లో 4వేలకుపైగా, ఇటలీ, ఇరాక్‌లో 3 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
- ఇండోనేసియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్‌లో సగటున 5 వేల కేసులు నమోదవుతున్నాయి.
వైరస్ విజృంభణ దృష్ట్యా పలు దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.