అమెజాన్ కార్చిచ్చుపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో.
1600 కొత్త ప్రాంతాల్లో..
అమెజాన్ కార్చిచ్చుపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో.
1600 కొత్త ప్రాంతాల్లో..
కార్చిచ్చును అదుపు చేసేందుకు వేల మంది సిబ్బంది రోజుల తరబడి శ్రమిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు 1600 పైగా కొత్తగా మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సంఖ్య 85 వేలకు చేరుకుంది. 2010 నుంచి చెలరేగిన కార్చిచ్చులో ఇదే అతిపెద్దది.
అమెజాన్ కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రపంచ దేశాల మద్దతు కోరారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. ఐరాస సాధారణ సమావేశంలోనూ దీనిపై చర్చిస్తామని తెలిపారు. బొలీవియాలోనూ కార్చిచ్చు చెలరేగినట్లు ఐరాస పేర్కొంది.
ఇదీ చూడండి: బ్రిటన్ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు