బ్రెజిల్ ప్రథమ మహిళ మిషెల్ బోల్సోనారో అవినీతి కుంభకోణంపై ప్రశ్నించిన ఓ విలేకరిపై ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మండిపడ్డారు. పలుమార్లు ఈ అంశంపై ప్రశ్నించగా సహనం కోల్పోయిన ఆయన.. నిన్ను చితకబాదాలని ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రెసీలియాలోని మెట్రోపాలిటన్ క్యాథడ్రల్ సందర్శనకు వచ్చిన సమయంలో ఓ విలేకరి అధ్యక్షుడ్ని కలిశారు. ఈ సందర్భంగా మిషెల్ కుంభకోణంపై ప్రశ్నించగా.. 'నీ మూతిపై పిడిగుద్దులు కురిపించాలని ఉంది' అంటూ ధ్వజమెత్తారు.
విలేకరిని బెదిరించటంపై అక్కడున్న మిగతా పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. దాంతో మారుమాట్లాడకుండా అక్కడినుంచి వెల్లిపోయారు బోల్సోనారో.