తెలంగాణ

telangana

అమెజాన్​పై జీ-7 ఆర్థికసాయం అక్కర్లేదు: బ్రెజిల్​

By

Published : Aug 27, 2019, 10:35 AM IST

Updated : Sep 28, 2019, 10:38 AM IST

జీ-7 దేశాలు అమెజాన్​ కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రకటించిన ఆర్థికసాయాన్ని బ్రెజిల్ తిరస్కరించింది. అవి యూరోప్​లో అరణ్యాల పునరుద్ధరణకు ఉపయోగించాలని హితవు పలికింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్​ తన సొంత దేశాన్ని, వలసలను కాపాడుకోవాలని సూచించింది.

అమెజాన్​పై జీ-7 ఆర్థికసాయం అక్కర్లేదు: బ్రెజిల్​

అమెజాన్​ కార్చిచ్చును అదుపు చేసేందుకు జీ-7 దేశాలు ప్రకటించిన ఆర్థికసాయాన్ని బ్రెజిల్ తిరస్కరించింది. ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్​... తన దేశాన్ని, వలసలను జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికింది.

"మేము జీ-7 దేశాల సాయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ ఆర్థికసాయం మా కంటే... యూరోప్​లో అరణ్యాల పునరుద్ధరణకే ఎక్కువ అవసరం."

"బ్రెజిల్ ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుతమైన దేశం. ఈ దేశం ఎప్పుడూ వలసవాద, సామ్రాజ్యవాదాన్ని అనుసరించలేదు. బహుశా అది ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ లక్ష్యమై ఉండొచ్చు." - ఒనిక్స్ లోరెంజోని, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో చీఫ్​ ఆఫ్ స్టాఫ్​

మాట మార్చిన బ్రెజిల్​

ఇంతకు ముందు అమెజాన్ కార్చిచ్చును నియంత్రించడానికి జీ-7 దేశాలు అందిస్తున్న సాయాన్ని స్వాగతిస్తున్నట్లు బ్రెజిల్ పర్యావరణ మంత్రి రికార్డో సల్లెస్​ తెలిపారు. అయితే అధ్యక్షుడు బొల్సొనారో ఆదేశాలతో బ్రెజిల్ మంత్రులు మాట మార్చారు.

20 మిలియన్​ డాలర్ల సహాయం..

బియారిడ్జ్​లో సోమవారం జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో.... 'వాతావరణం, జీవవైవిధ్యం, మహాసముద్రాల పరిరక్షణ'పై సమావేశం జరిగింది. అమెజాన్​ కార్చిచ్చును అదుపుచేయడానికి, అలాగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలని అగ్రదేశాధినేతలు నిర్ణయించారు. ఇందుకోసం బ్రెజిల్​కు 20 మిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్నీ ప్రకటించారు.

ఇదీ చూడండి: 'నేను పర్యావరణ వేత్తను.. ఈ సమావేశం నాకెందుకు'

Last Updated : Sep 28, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details