ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయం వచ్చేందుకు అధికార, ప్రతిపక్షాలు రాజీ పడాల్సిన అవసరం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్‌పై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
విధానపరంగా లేబర్ పార్టీతో విభేదించే అంశాలు చాలా ఉన్నాయి. కానీ బ్రెగ్జిట్ విషయంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం ఉంది. ప్రజారవాణాపై ఆంక్షలు, మంచి ఒప్పందంతోనే ఈయూ నుంచి వైదొలగటం, ఉద్యోగాల సంరక్షణ, భద్రతను కాపాడుకోవటం లాంటివి ఇందులో ఉన్నాయి.- థెరిసా మే, బ్రిటన్ ప్రధానమంత్రి