Botched Surgery eye failure: ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు ఓ వృద్ధుడు. కనురెప్పలు మూయలేక.. నేత్ర సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నాడు. నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్నాడు.
ఏం జరిగింది?
Cosmetic surgery fail: పీట్ బ్రాడ్‌హర్స్ట్.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ వాసి. వయసు 79 ఏళ్లు. పెళ్లయి.. ఇద్దరు పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పళ్లకు సంబంధించి ఓ శస్త్రచికిత్స చేయించుకున్నాడు పీట్. అయితే.. ఆ సర్జరీ వల్ల అతడి బుగ్గల రూపం మారిపోయింది. చూడడానికి కాస్త ఇబ్బందికరంగా తయారయ్యాడు అతడు. "నువ్వు అందంగా లేవు" అంటూ పీట్ భార్య అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతడు చాలా బాధపడ్డాడు. ఎలాగైనా అందంగా, యువకుడిలా కనిపించాలని అనుకున్నాడు.
2019లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాడు పీట్. బుగ్గల రూపం మార్చుకుని, కళ్ల కింద క్యారీ బ్యాగులు, ముఖంపై ముడతలు పోయేలా.. నెక్ లిఫ్ట్, అండర్ ఐ బ్లెఫారోప్లాస్టీ, రైనోప్లాస్టీ వంటి రకరకాల చికిత్సలకు సిద్ధమయ్యాడు. వీటన్నింటికీ బర్మింగ్హమ్లోని బీఎంఐ ఆస్పత్రి వేదికైంది. వైద్యులు ఏకధాటిన 9 గంటలపాటు సర్జరీ చేశారు. పీట్‌కు 11 వేల పౌండ్లు( సుమారు రూ.11 లక్షలు) బిల్ వేశారు.
plastic surgery unable to close eyes
ఇంటికెళ్లాక చూస్తే...
సర్జరీ అయిన వెంటనే పీట్‌కు ఏదో తేడాగా, ముఖంపై ఎవరో తీవ్రంగా కొట్టినట్టు అనిపించింది. కళ్లు మూయలేకపోతున్నానన్న భావన కలిగింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అలానే డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లాడు పీట్. కుట్లు తీయించుకునేందుకు రెండు వారాల తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. కళ్లలో మంటగా ఉందని, తరచూ నీరు కారుతోందని వైద్యులకు చెప్పాడు. వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. సైడ్ ఎఫెక్ట్స్ సహజమేనని, నెమ్మదిగా సెట్ అయిపోతుందని చెప్పారు.