బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రెగ్జిట్ వివాదంతో పదవి నుంచి తప్పుకున్న థెరిసా మే నుంచి బోరిస్ జాన్సన్ నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకు ముందు బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు రాజీనామా పత్రం అందిస్తారు థెరిసా.
అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు జరిగిన ఓటింగ్‌లో ఆ పార్టీకి చెందిన 1.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్‌కు 92,153 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి జెరెమీ హంట్‌కు 46 వేల 656 ఓట్లు వచ్చాయి.