తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​కు మరో అవాంతరం.. 31న సాధ్యమయ్యేనా? - boris johnson

ముందుగా నిర్ణయించిన జనవరి 31వ తేదీలోగా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోయే అంశమై సందిగ్ధత నెలకొంది. బ్రెగ్జిట్​ నేపథ్యంలో బ్రిటన్​లో నివసిస్తున్న ఈయూ పౌరులకు గుర్తింపు కార్డుల జారీకి పట్టుబట్టారు ఎగువసభ సభ్యులు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్​ బిల్లుకు సవరణ చేపట్టాలని ఓటింగ్ నిర్వహించారు. బిల్లు సవరణ చేసేందుకు 270-229 తేడాతో ఎగువసభ ఆమోదం తెలిపింది. జనవరి 31 లోగా రెండు సభల్లో బిల్లుకు ఆమోదం లభిస్తేనే బ్రెగ్జిట్ సాధ్యమౌతుంది.

boris johnson
బోరిస్ జాన్సన్

By

Published : Jan 21, 2020, 12:09 PM IST

Updated : Feb 17, 2020, 8:32 PM IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్ ప్రణాళికలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్​బిల్లుకు సవరణ చేయాలంటూ పార్లమెంట్ ఎగువసభ హౌస్​ ఆఫ్​ లార్డ్స్​ తీర్మానించింది. బ్రిటన్​లో నివసిస్తున్న ఐరోపా సమాఖ్య పౌరులకు బ్రెగ్జిట్ అనంతరం గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న నిబంధనను బిల్లులో ఉంచాలని డిమాండ్ చేసింది.

బ్రెగ్జిట్ సవరణ ప్రతిపాదనకు 270-229 ఓట్లతో ఎగువసభ ఆమోదం తెలిపింది. బ్రెగ్జిట్ అనంతరం ఐరోపా సమాఖ్య సభ్యులు బ్రిటన్​లో నివసించేందుకు హక్కు పత్రాన్ని జారీ చేయాలని ఈ ప్రతిపాదన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎగువసభ సభ్యులు.

ప్రస్తుతం ఈయూ పౌరులు వారి శాశ్వత నివాసాన్ని ఆన్​లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం కల్పించింది బ్రిటన్. అయితే వారికి ఎలాంటి పత్రం జారీ చేయలేదు. దీనిపైనే పార్లమెంట్ ఎగువసభ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈయూ పౌరులకు గుర్తింపు పత్రం లేకపోవడం వారికి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని లిబరల్ పార్టీ నేత జానీ ఓట్స్ అభిప్రాయపడ్డారు. భూస్వాములు, ఇతర అధికారులతో వ్యవహరించే సమయంలో వారికి గుర్తింపుకార్డు అవసరమౌతుందని వెల్లడించారు.

జనవరి 31 లోగా బ్రెగ్జిట్​ బిల్లు రెండు సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంది. సభ్యుల తాజా ప్రతిపాదన నేపథ్యంలో గడువులోగా బ్రెగ్జిట్​కు ఆమోదం తెలిపే అంశమై అనుమానాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: భాజపా రెండో జాబితా విడుదల

Last Updated : Feb 17, 2020, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details