బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్న ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఫోన్ లాక్కొని కసురుకుంటూ జేబులో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా... బోరిస్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ జరిగింది
డిసెంబర్ 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై బోరిస్‌ను ఇంటర్వ్యూ చేశారు ఐటీవీ రిపోర్టర్ జో పైక్. ఓ ఆస్పత్రిలో నాలుగేళ్ల బాలుడు నేలపై పరిచిన వస్త్రాలపైనే పడుకుని చికిత్స తీసుకుంటున్న ఫొటోను ప్రధానికి చూపించారు. అసహనానికి గురైన జాన్సన్... టక్కున ఆ ఫోన్ లాక్కుని, జేబులో పెట్టుకున్నారు.