తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రిటన్​కు ఇవి అద్భుత క్షణాలు'

బ్రిటన్ స్వేచ్ఛ ఇప్పుడు దేశ ప్రజల చేతుల్లోనే ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. యూకే ప్రజలంతా ఒక్కతాటిపైకి రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

boris-johnson-celebrates-amazing-moment-of-uks-exit-from-the-eu
'బ్రిటన్​కు ఇవి అద్భుతమైన క్షణాలు'

By

Published : Jan 1, 2021, 5:06 PM IST

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన సందర్భంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అమితానందం వ్యక్తం చేశారు. ఇవి అద్భుతమైన క్షణాలని పేర్కొన్నారు. ఉత్తమ, వైవిధ్యమైన చర్యలు చేపట్టే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని తన నూతన సంవత్సర సందేశంలో చెప్పుకొచ్చారు.

"దేశానికి ఇవి అద్భుత క్షణాలు. స్వేచ్ఛ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. దాన్నుంచి ఎంతగా ప్రయోజనం పొందాలని మనమే నిర్ణయించుకోవాలి. యూకే ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి విలువల కోసం పనిచేయడం చాలా గొప్ప విషయం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

ఆక్స్​ఫర్డ్ టీకాకు అత్యవసర అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బోరిస్. 2021కి సూర్యోదయం లభించిందని వ్యాఖ్యానించారు. తక్కువ ధరకే ఉత్పత్తి చేయగలిగే ఈ టీకా వల్ల ప్రజలకు కొత్త జీవితం అందుతుందని అన్నారు. 2020 ఏడాది సమాజంలోని సమైక్యతను తిరిగి వెలికితీసిన సంవత్సరమని పేర్కొన్నారు బోరిస్.

ఇదీ చదవండి:ఈయూ, బ్రిటన్​ల బంధానికి చివరి రోజు

ABOUT THE AUTHOR

...view details