ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం చాలా అరుదేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా తీసుకోవడం వలన కలిగే థ్రాంబోసైటోపెనియా, థ్రాంబోసిస్(వీఐటీటీ)లపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటిష్ ఆరోగ్య సేవల(ఎన్హెచ్ఎస్) ఫౌండేషన్లు సంయుక్తంగా ఓ పరిశోధన చేపట్టాయి. దీని పరిశోధనా పత్రం 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైంది.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం 220మందిలో తలెత్తిన లక్షణాలను పరిశీలించిన ఈ బృందం.. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డకట్టే అవకాశాలు చాలా అరుదు అని పరిశోధనలో భాగమైన డాక్టర్ పావర్డ్ అన్నారు.
"రక్తం గడ్డకట్టే విషయాన్ని అర్థం చేసుకునేందుకు నిర్విరామంగా కృషి చేశాం. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిపై పోరులో అత్యంత కీలకమైన పరిష్కారం."