ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలో వందలాది మంది నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేసి నిరసన తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో జాత్యహంకారం నశించాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు.
అయితే హింసాత్మక ఘర్షణలను నివారించడానికి.. బ్రిటన్ పోలీసులు ముందస్తుగా కఠిన ఆంక్షలు విధించారు. పెద్ద మొత్తంలో నిరసనలు జరుగుతాయని గుర్తించిన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా వంద మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు.