నిరాశ్రయులకు సొంత ఇంటిని నిర్మించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. స్కాటిష్ ఛారిటీ సహ వ్యవస్థాపకుడు జోష్ లిటిల్జోన్.. వరల్డ్స్ బిగ్ స్లీప్ ఔట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిరాశ్రయులకు ఇంటి నిర్మాణానికి నిధులను సేకరించేందుకు ప్రజలందరూ ఒక రోజు రాత్రి వీధుల్లో నిద్రించాలని ప్రచారం చేశారు.
నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర! - london latest news
నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించేందుకు వరల్డ్స్ బిగ్ స్లీప్ ఔట్ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు స్కాటిష్ ఛారిటీ సహ వ్యవస్థాపకుడు. లండన్, న్యూయార్క్, బ్రిస్బేన్ వంటి ప్రముఖ నగరాల్లో ప్రజలంతా ఒక రోజు రోడ్లపై నిద్రించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర!
ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. లండన్, ఎడిన్‌బర్గ్, కార్డిఫ్, న్యూయార్క్, బ్రిస్బేన్, డబ్లిన్ నగరాల్లో ప్రజలు వీధుల్లో నిద్రించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది వరల్డ్స్ బిగ్ స్లీప్ ఔట్ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులూ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు