అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మరోమారు చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రపంచానికి సహాయం చేయాల్సింది పోయి.. పొరుగుదేశాలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. చైనాను ఏకాకి చేయాలని ప్రపంచ దేశాలను కోరారు పాంపియో.
ఇదీ చూడండి:-'అన్ని దేశాలకు కరోనా వ్యాపించేలా చైనా కుట్ర'
లండన్‌లో బ్రిటన్ విదేశాంగమంత్రి డొమినిక్ రాబ్‌తో సమావేశమైన అనంతరం పాంపియో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకుని చైనా కమ్యూనిస్ట్ పార్టీ దోచుకోవడం మొదలుపెట్టింది. ఇది ఎంతో అవమానకరమైన విషయం. ప్రపంచానికి సహాయం చేయాల్సిన సమయం ఇది. కానీ చైనా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. హంగ్‌కాంగ్ స్వేచ్ఛను హరించింది. పొరుగుదేశాలపై బెదిరింపులకు పాల్పడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో సైనిక చర్యలు చేపడుతోంది. భారత్‌తో గొడవకు దిగుతోంది. అంతర్జాతీయ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే చైనా సహా ప్రపంచ దేశాలన్నీ కలిసిగట్టుగా పనిచేయాల్సిందే."