క్షయపై పోరులో భాగంగా ఉపయోగించే 'బాసిల్లే కాల్మెటె- గెర్విన్(బీసీజీ)' టీకా కొవిడ్ సంక్షోభ సమయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపబోదని తాజా అధ్యయనమొకటి నిర్ధరించింది. ఈ టీకా సురక్షితమైనదేనని.. కొవిడ్ ముప్పునేమీ పెంచబోదని తేల్చి చెప్పింది.
కొవిడ్ సంక్షోభంలోనూ బీసీజీ టీకా సురక్షితమే! - కొవిడ్ సంక్షోభంలోనూ బీసీజీ టీకా సురక్షితమే!
క్షయ వ్యాధిపై పోరులో ఉపయోగించే బీసీజీ టీకా కొవిడ్ సమయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపించదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ టీకా.. కొవిడ్ ముప్పునేమీ పెంచబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ అంశంపై నెదర్లాండ్స్‌లోని రాడ్బౌన్ విశ్వవిద్యాలయం పరిశోధన నిర్వహించింది.
ఐదేళ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న పలువురు వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితి, దాన్ని పొందని ఆరోగ్యవంతుల పరిస్థితి కరోనా సంక్షోభం మొదలయ్యాక ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించేందుకుగాను నెదర్లాండ్స్‌లోని రాడ్బౌన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పోల్చి చూశారు.
బీసీజీని వేయించుకున్నవారు కరోనా సోకినా ఎక్కువగా అనారోగ్యం బారిన పడట్లేదని గుర్తించారు. వారు తీవ్రంగా జబ్బు పడుతున్న దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడే ముప్పును బీసీజీ టీకా పెంచుతున్న పరిస్థితులేవీ లేవని కూడా వారు తెలిపారు.