Bank accidentally paid money: బ్రిటన్కు చెందిన 'సాంటాండర్ యూకే' అనే బ్యాంకు క్రిస్మస్ రోజున వేల మంది ఖాతాదారుల అకౌంట్లలోకి తప్పుగా డబ్బులు డిపాజిట్ చేసింది. మొత్తం 175.9 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,310 కోట్లు)ను బదిలీ చేసింది. క్రిస్మస్ రోజున తనకు రెండుసార్లు నగదు బదిలీ జరిగిందని ఓ ఖాతాదారుడు వెల్లడించారు. ఇలా 75 వేల షెడ్యూల్డ్ పేమెంట్ లావాదేవీలు.. రెండుసార్లు చొప్పున జరిగాయని ది టైమ్స్ ఆఫ్ లండన్ తెలిపింది.
Money accidentally deposited
నకిలీ లావాదేవీల సమస్యను గుర్తించినట్లు బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. సాంకేతిక తప్పిదంతోనే ఇలా జరిగిందని తెలిపారు. కస్టమర్లకు పొరపాటున బదిలీ చేసిన నగదును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ తప్పిదం కారణంగా రెండు వేల వాణిజ్య, కార్పొరేట్ ఖాతాలపై ప్రభావం పడిందని ది టైమ్స్ వెల్లడించింది. లావాదేవీల్లో చాలా వరకు ఉద్యోగులకు చేసిన చెల్లింపులే ఉన్నాయని తెలిపింది.