తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానంలోనే మహిళ ప్రసవం.. ఎక్కడంటే? - ఎయిర్ఇండియా విమానంలో ప్రసవించిన మహిళ

లండన్​ నుంచి కొచ్చిన్​కు వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానంలో ఓ మహిళ ప్రసవించింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికార వర్గాలు తెలిపాయి. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

Baby born
విమానంలోనే మహిళ ప్రసవం

By

Published : Oct 7, 2021, 5:32 AM IST

ఓ మహిళ విమానంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విమానంలో ఉన్న నలుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లు ఆమెకు సహకరించారు. మహిళకు నెలలు నిండక ముందే కాన్పు జరిగినట్లు ఎయిర్ఇండియా అధికార వర్గాలు తెలిపాయి.

మహిళతో విమాన సిబ్బంది

ఏం జరిగిందంటే..?

ఎయిర్ఇండియా సంస్థకు చెందిన ఏఐ 150 విమానం లండన్​ నుంచి కొచ్చిన్​కు మంగళవారం బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 203 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకు నొప్పులు వచ్చాయి. దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు... ఆమెకు వైద్యం చేశారు.

" ఏఐ 150 విమానం 202 మంది ప్రయాణికులతో అక్టోబరు 5న లండన్​ నుంచి కొచ్చిన్​కు బయల్దేరింది. ఆ తర్వాత ఫ్రాంక్​ఫర్ట్ విమానాశ్రయంలో 203 మంది ప్రయాణికులతో ల్యాండ్ అయింది. విమానం గాలిలో ఉండగా అద్భుతం జరిగింది. మగబిడ్డ జన్మించాడు."

-- ఎయిర్ ఇండియా

మహిళకు మెరుగైన వైద్యం అందించేందుకు విమానాన్ని ఫ్రాంక్​ఫర్ట్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసింది ఎయిర్​ఇండియా. ప్రస్తతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. తమ అధికారులు మహిళ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని, త్వరలోనే తమతో పాటు తల్లీ, బిడ్డ ఇంటికి రానున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:Chardham yatra news: చార్​ధామ్​ యాత్రకు ఇవి తప్పనిసరి..

ABOUT THE AUTHOR

...view details