రొమేనియాలోని పియట్రా నీమ్ట్ ప్రాంతంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఐసీయూ వార్డులోకి ఎగబాకాయి. ఈ దుర్ఘటనలో 10 మంది రోగులు చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
కొవిడ్ ఆసుపత్రిలో మంటలు-10 మంది మృతి - Smoke
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. రొమేనియాలో జరిగిన ఈ ఘటనలో 10 మంది రోగులు చనిపోయారు.
కొవిడ్ ఆసుపత్రిలో మంటలు-10 మంది మృతి
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని రొమేనియా ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.